కన్నయ్య
నల్లని వన్నె వాడు
చల్లని చూపులవాడు
ఎల్లలలోకాలకు
ఏలిక యై నవాడు
గోపజనుల యుల్లముల
కొల్లగొట్టిన వాడు
వల్లమాలిన ధైర్యముతో
క్రూరరాక్షసులదర్పమడచిన వాడు
చిలిపి చిలిపి చేష్టలతో
అలతి ఆలతి మాటలతో
అత్మ యొక్క యునికి నంత
వెలికితీసి చూపినాడు
అందమైన మోము తొడ
అందరిని మోహపరచి
అవని లోని జీవులన్నీటి
ఆత్మఒక్కటేయని తెలియజే సి
తనను వెదకు గోపికలను
ఊరడించి మాయజెసి
గోచరించి ఆనందం పంచినాడు