మా బదరి యాత్ర
1-4-2001 సంవత్సరం లో స్వచ్చంద పదవీ విరమణ తర్వాత నాకు శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి భగవాన్ వారి కరుణా కటాక్షం తో పుట్టపర్తి లో జరుగు 1-4-2001 సంవత్సరం లో స్వచ్చంద పదవీ విరమణ తర్వాత నాకు శ్రీ శ్రీ శ్రీ సత్యా సాయి భగవాన్ వారి కరుణా కటాక్షం తో పుట్టపర్తి లో జరుగు సేవాకార్యక్రమములో పాలుగొనే అవకాశం వచ్చింది. ఆ సందర్బముగా శ్రీమతి విజయమ్మ గారు రచించిన "ప్రత్యక్షముతో పరోక్షనికి " పుస్తకం చదివే అవకాశం కలిగింది. అందులో రచయిత్రిగారు స్వామి తో బదరి యాత్ర అనుభవాలు రమ్యముగా వర్ణించారు . అప్పుడు నాకు కూడా యాత్ర చేయాలని సంకల్పం బయలుదేరడానికి. నేను నా శ్రీమతి మతమ్ముడు మాల్యద్రి వాడి శ్రీమతి కలసి బయలుదేరాము
ప్రకృతి సిద్దంగా వెలసిన దేశ సరిహద్దుగా నిలచిన హిమాలయ పర్వత పంక్తులలో ఎనలేని పుణ్యక్షేత్రములు తీర్థములు ఋష్యాశ్రమములు గుహలు పుణ్యనదీజన్మస్థ్లములు ఎన్నో ఉన్న ప్రదేశం చూడడానికి మేము ఎంత పుణ్యం చేసుకొన్నామో నాస్తికులను సైతము ఆస్తికులచేయు పుణ్యభూమి .ఆధ్యాత్మిక సంపదకు నెలవులు ఈ పర్వత శ్రేణులు. ఓషదులకు నెలవైన ఈపర్వత పంక్తులు శివకేశవులకు నివాసస్థలం హిమాలయాలు. ఒకవైపు కేదారనాథ్ మరోవైపు బదరీనాథ్ దేవాలయాలు .దర్శనంచేసుకోవడానికి కష్టసాద్యామ్ భయానకమైన ప్రయాణం. నర నారాయణ మహారుషుల తపొ ప్రభావముతో వెలసిల్లిన మహా పర్వత శ్రేణులు ఈ హిమాలయలు కేదారనద్ , బదరీ యాత్రను 22-1-2001 న డిల్లీ నుండి ప్రారంభించాలని నిశ్చయం చేసుకొని డిల్లీ లూనే రావుట్రావెల్స్ వారి ని సంప్రదించాము. మా ఆఫీసు లో టైపిస్ట్ సోదరుడే రావుట్రావెల్స్ అధినేత . 22-6-2001 కి 4 సీట్లు బుక్ చేశాము. డిల్లీ వెళ్లడానికి 19-6-2001 న ఉదయం 4-30 గం లకు విజయవాడ నుండి డేల్లి తమిళనాడు నుండి డేల్లి కె రిజర్వ్ చేయించాను. మాల్యద్రి వాళ్ళు అనుకున్నట్లుగానే మైలవరం వచ్చారు . అక్క్డనుండి 13-6-2001 నుండి మొదట జగ్గయ్యపేటలో ఉన్న మా చిన్న కుమార్తె లక్ష్మి ఇంటికి వెళ్లాము. అక్కడనుండి వేదాద్రి నరసింహస్వామి దర్శనం తర్వాత తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం అక్కడున్న
పుట్టకు నమస్కారం చేసుకొన్నాము. 18-6-2001 న సాయంకాలం భోజనం చేసుకొని రాత్రి 9-30 గం లకు మైలవరం నుండి బస్ లో విజయవాడ చేరుకొని రైల్వే స్టేషన్ లో రెస్ట్ తీసుకొని ఉదయం 5-30 కి తమిళనాడు ఎక్ష్ప్ర్స్స్ ఎక్కాము.20-6-2001 ఉదయం 7-30 కి న్యూ డెల్లి స్టేషన్ లో దిగాము. స్టేషన్ నుండి ట్రావెల్స్ కి ఫోన్ చేసి అడ్రెస్ కనుక్కొని వాళ్ళ ఆఫీసు కు ఆటొ లో వెళ్లామురావు ట్రావెల్స్ ఏజెంట్ వచ్చాడు. ఆయనతో ఎక్కడయినా వసతి చూపించమని అడిగా. సఫ్దర్ జంగ్ రోడ్ దగ్గర ఉన్న మాతృమందిరం ఎన క్లేవే లో సూట్ కు ఫోన్ చేసి ఒకఒక రూమ్ బుక్ చేశాడు. ట్రావెల్స్ వారి తటసుమో లో అక్కడకు పంపాడు. త్రోవలో ఒక హోటల్ లో భోజనం పార్శిల్ చేయించుకొని రూమ్ చెరము. రావు ట్రావెల్స్ మా టూర్ ప్రోగ్రామ్ నిర్ణయించి 20-6-2001 ఉదయం 6-30 గం లకు డెల్లి లాంగ్ టెన్నిస్ స్టేడియం బస్ స్టాప్ దగ్గర ఉండమని ఆగ్రా ,మధుర,బృందావనం ట్రిప్ తీసుకెళ్తామని చెప్పారు. ఆ బస్ స్టాప్ మేము న్న చోటికి దగ్గిరే.మధ్యాన్నం భోజనం చేసాక కొంతసేపు విశ్రమించాము. తర్వాత మాతృమందిరం లోనే భోజనవసతి కూడా ఉన్నదని తేలిసింది.ముందుగా ఆర్డర్ ఇవ్వాలని చెప్పారు. సాయంకాలానికి డిన్నరుకు మా నలుగురికి భోజనం ఆర్డర్ ఇఛ్చాను.తీరా భోజనం సమయంకు తెలిసింది ఇక్కడ శాకాహారం టూ బాటు మాంసాహారం కూడా వండు తారని అన్నారు. అక్కడ భోజనం చేయ బుద్ది పుట్టలేదు. సపరేట్ గ వడ్డించుతారని చెప్పారు గాని మాకు మనస్కరించలేదు.. ఇక్కడ మందిరానికి అనుభందం గా మాంసాహారం ఎలా వండుతారో అర్ధం కాలేదు .ఆ పూటకు భోజనం మానేశాము. ఇది బెంగాలీ వారి సాంప్రదాయము.వారి ఆద్వర్యం లో నడుస్తున్న దేవాలయం ఇది. దేవాలయం అందులోని దేవుని విగ్రహాలు పాలరాతితో చాల అందముగా ఉన్నవి.. మధ్య మందిరములో కాళికాశక్తీ అమ్మవారు , శ్రీ రామకృష్ణపరమహంస అమ్మవారి భక్తుడు గదా ప్రక్కన మందిరాలలో రాధ కృష్ణుల విగ్రహాలు, ఈశ్వరుని మందిరం ఉన్నాయి. పూజారుల స్వరం అదోమాదిరిగాఉంటుంది.సాయంకాలం భజన హారతి కార్యక్రమములు జరుగుతాయి...చాల బాగుగ ఉన్నాయి ఆరోజే మేము సాయంకాలం 4-30 గం లకు 2 కి మి. దూరములో ఉన్న సరోజిని మార్కెట్ కు వెళ్ళాము. బదరికియాత్ర కు కావలసిన ఉలాన్ స్వేట్టర్లు సాక్సు బూట్స్ వగైరా కొన్నాము. రాత్రి అక్కడే నిద్రించాము.
21-6-2001 ఉదయం 5 గం లకు కాలకృత్యాలు నెరవేర్చుకొని 6-30 కల్లా ప్రక్కనే ఉన్న ఢిల్లీ లో లాన్ టెన్నిస్ స్టేడియం స్టాప్ దగ్గర బస్సు కోసం నిరీక్షించాము.. ఉదయం 7-30 గం లకు ట్రావెల్స్ వారి బస్సు వచ్చింది. రావ్ ట్రావెల్స్ ఏజెంట్ సుబ్బారావు అక్కడకు వఛ్చి మా కు సీట్స్ చూపి రాజధాని చూడడానికి ముందుగా ఆగ్రా లో తాజ్మహల్ చూడాలనుకున్నాం . ఢిల్లీ లో బయలుదేరిన బస్సు ఢిల్లీశివారు ప్రాంతమైన కల్కాజి ప్రాంతం చేరాము . దగ్గర లోఉన్న అక్కడ కాళీ మందిరం దానికి కొంత దూరములో బహాయి మతం వారి చేత నిర్మించబడ్డ లోటస్ మందిరం ఉన్నది . ఆ కట్టడం పద్మాకారం లో అద్భుతం గ ఉన్నది ,అక్కడనుండి నేరుగా ప్రయాణం చేసి 5 గంటలకు ఆగ్రా చేరాము. మొదట ఆగ్రా కోట్ చూసాము ఎంట్రెన్స్ టికెట్ మనకు 20/- విదేసీయులకైతే 10 డాలర్లు . ఆగ్రా కోట లో కొంత భాగము మాత్రం చూడగలిగాము. సమయం తక్కువ చూడవలసింది ఎక్కువ. అంతా తిరగలేక పోయాము . ముక్కైనా మైన ప్రదేశాలు మాత్రం చూసాము రేపైర్స్ చేస్తుండటంవల్ల కొన్ని చూడటానికి అవకాశం లేదు . సీస్ మహల్ కు అనుమతి లేదు.. ఎదూసుమ్మిట్ కొరకు చేస్తున్నారట. ఆగ్రా కోటకు చుట్టూరా పెద్దకందకం ఉన్నది. కోటాపై నుండి చుస్తే యమునకు అవతలి వైపు తాజ్ మహలు దర్సనము అవుతుంది.. ఆ కోటలోపలి భవనములో గోడకు కటకం అమర్చాడట షాజహాన్ నవాబుకుమారుడు . తండ్రి ఆ కటకము నుండి తాజ్మహల్ చుసే వాడు .. ప్రస్తుతము ఆ కట్కములేదు కాని అక్కడ గైడ్ మనకు ఒక గాజు పెంకు పెట్టి ఈసంగతి చెపుతాడు. ఎక్కుడు దిగుడు మూలాన నడక కొంచం కష్టమే. తిన్నగా బస్సు దగ్గర కు చేరాము . మా ప్రయాణము తాజ్ వైపు సాగింది . ఆగ్రా పట్టణం తాజ్ కి వెళ్లే దారి మన పాతహైద్రాబాద్ లోగ ఉన్నది . ఇరుకుసందులు మసీదు శిఖ రాలు . టీజ్ మోడలు రూమ్ కి వెళ్ళాము .అది ఒక విక్రయ శాల .మేము ఉరక చూస్తూ అంత కలయ తిరిగాము. బస్సు తాజ్ వైపు బయలు దేరింది.ఇంక తాజ్ 1.5 కిలోమీటర్ దూరం ఉందనగా బస్సు ఆగిపోయింది . అక్కడ నుండి టాంగా లోవెళ్ళాలి. బస్సువెళ్లాడని చెప్పారు. నడవడం కష్టమని టాంగా లో బయలు దేరాము ..పెట్రోల్ డీసెల్ కాలుష్యం వల్ల తాజ్ అందాలు తగ్గుతాయని ఇట్ల చేసారు . బట్టారు టూ తిరిగే ఆటో మాత్రం ఎలవు చేస్తారు .మేము గుర్రం బండి లో తాజ్ చేరాము . మెయిన్ గేట్ దగ్గర ప్రవేశానికి టికెట్ తీయిసుకొని లోని కి వెళ్ళాము .తాజ్ గురించి తెలియని వాళ్లెవరు ఉండరు గదా , షాజహాన్ భార్య ముంతాజ్ సమాధి .పాలరాతి నిర్మాణం ఆ రోజు యాత్రికులు ఎక్కువ గ ఉన్నారు. . ఫోటో టిఇసుకోదానికి కష్టమైంది . బయటికి అందం గ కనిపించే కట్టడంలో గోరీలు తప్ప ఏముంది . చెప్పులు వేసుకోకుండా నడవడం వాళ్ళ ఎండకు కాళ్ళు కాలాయి. తిన్నగా బయలు దేరి బస్సు దగ్గరకు వచ్చాము . పంజాబీ హోటల్ చేరి పరోటా తిన్నాము . ప్రయాణం మొదలైయింది . .ఎండ చాల తీవ్రముగా యున్నది.
ఆగ్రా పొలిమేరలు దాటి బస్సు ఢిల్లీ వైపు బయలుదేరింది. ఈ మధ్యనే మధుర బృందావనం ఉన్నాయి. శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన, బాల్య చేష్టలతో అలరించిన పుణ్యభూమి కావడం వల్లనేమో ఆ ప్రాంతాల్లో లభ్యమవుతాయని చూడ్డానికి మనసు పరుగులుతీసింది. మధుర చేరాము. కృష్ణజన్మ స్తలము చూచాము.కానీ మందిరరూపురేఖలు మరి మసీదుగ మార్పు చెందింది. దేవకీ వసుదేవులకు విష్ణుమూర్తిగా ప్రత్యక్షమైన గదిని చూచాము. మాయాదేవి కనిపించిన గది కూడా గైడ్ చూపాడు . ప్రక్కనే మదనమోహనుని చే నిర్మిచబడిన కృష్ణ మందిరము చూచాము . చాల అందమైన మందిరం అది. పాలరాతి విగ్రహాలు . ప్రక్కనే కంసునికి తనను కడతేర్చ
డానికి బాలుడు జన్మించాడని హెచ్చ రిక్ చేసిన మాయ దేవి యోగమాయ గది బొమ్మలకొలువు లాగా ప్రదర్సన చేసారు.. కెమెరా అనుమతి లేదు . బయటనే ఫోటో లు తీసుకొన్నాము. . తిరిగి బయటకు వఛ్చి బృందావన వైపు బస్సు బయలు దేరింది.దారిలో ఒక గైడ్ బస్సు లోఎక్కి మాకు స్తలవిశేష,లు చెప్పాడు . ఉత్తర ప్రదేశ్ హిందీ లో చెప్పాడు .
.బృందవంలో దేవాలయాలు చాలా ప్రాచినమయినవి కృష్ణమందిరం ,నందగోపుని నిలయం చూచాము .ఇక్కడ విగ్రహాలు నల్ల రాయి తో చెక్కబడి ఉన్నాయి. ఇది కూడ ముస్లీముల విధ్వంసకార్య లో బలిఅయ్యాయి .ఆదృశ్యాలు గైడు చూపించాడు. నంద గోపుని మందిరం యశోదమ్మ మందిరం కృష్ణ నిలయం చూచాము .. శ్రీ కృష్ణుని నిజంగా చూస్తున్నట్లు భ్రమ కలిగించే విధంగా చక్కటి శిల్పకళ అప్పటి వాతావరణం కనిపించుతుంది. ప్రక్కన భజన మందిరం లో జరుగుతున్న హిందీ యాస తో కుడిన సంగీతం శ్రావణపేయంగా ఉన్నది.గోపికలతో కృష్ణుడు చేసిన రాసలీల సన్నివేశం ఒక సరి మాది లో తప్పక గుర్తుతెస్తాయి . ఒక పర్యాయం ద్వాపర యుగం లోకి ప్రవేశిస్తాము. కళింది నది ఇక్కడే దగ్గర్లోనే ఉన్నదట. మాకు సమయం లీక చూడలేదు . ఇక్కడ కోతులు కూడ ఉన్నాయి. అవి బహు విచిత్రంగా ప్రవర్తిస్తాయి . ఎవరయినా కళ్లజోడు పెట్టుకొనే ఉంటె వెంటనే అవి లాగుకొని వెళ్ళుతాయి . ముందుగా గైడ్ హెచ్చ్రించాడు .హిందీ అర్ధం కాక ఒక యాత్రికుడు కళ్లజోడు తీయ లేదు. వెంటనే కోతి వఛ్చి జూడు తీసుకెళ్లింది మరుక్షణంలో. స్వామి దర్సనం చేసుకున్నాం. అక్కడ 501 రూపాయలు కట్టితే వారి పేరు పలకాల్లో వేస్తారు. కొన్ని పలకలు చూచాము.. ఢిల్లీ వైపు ప్రయాణము సాగించాము. రాత్రి 9-30 గంటలకు ఒక పెద్ద హోటల్ దగ్గర బస్సు ఆపారు . అక్కడ భోజనాలు చేసితిరిగి బయలుదేరాము. 11-30 గంటలకు ఢిల్లీ పొలిమేరలకు చేరాము..మేము బాస చేసిన ఎనక్లేవ్ కు దగ్గర క్రాస్ రోడ్ దగ్గర మేము దిగితే ఎనక్లేవ్ గేట్ ఓపెన్ చేయరు అని ఆలోచించి రెండు రోడ్ల చివర దిగి ఒక ఆటో పీల్చి దానిలో మాతృమందిరం చేరాము .ఫ్లైఓవర్ ల మూలాన కొంచం కాంఫుసే అయ్యాము.. చివరకు 12 గంట లకు మాతృమందిరం చేరాము విశ్రమించాము. 22-6-2006 ఉదయం 4-30 లేచి కాలకృత్యాలు తీర్చుకొని .రాత్రికి బదరి కి ప్రయాణం అని ట్రావెల్స్ కి ఫోన్ చేసి రూమ్ లోనే ఉంది పోయాము. మధ్యాహ్నం ఆటోలో వెళ్లి దగ్గర్లోవున్న రెస్టరెంటులో భోజనం మైందనిపించాము మయాత్రలోఇక్కడ మాకు భోజనం దే ప్రాబ్లెమ్ .మాకు కావాల్సిన ఐటమ్స్ విడివిడి గ చెప్తే సర్వ్ చేసి బిల్ ఇచ్చ్చాడు. ఒక్కొక్కరికి 45/- అయింది . బదరి వెళ్లే బస్సు ట్రావెల్ ఏజెన్సీ వారి ఆపీసు దగ్గరనుండి బయలుదేరుతుంది. మేము గూడా తయారయ్యి 9-00 గంటలకు వసంతవిహార్ ఎనక్లేవ్ మార్కెట్ కు మా లగేజి తో సహా చేరుకున్నాము.ఈ ట్రావెల్ ఏజెన్సీ ని రావుగారు ఆయనకుమారుడు భార్య బావమరిది కల్సి నిర్వహించు తున్నారు. మేము వెళ్లే సమయానికి వీళ్ళందరూ అక్కడనే కూర్చునియున్నారు. బదరి యాత్రకు మరోజంట వెయిట్ చేస్తున్నారు .. బస్సు కు సరి పడ యాత్రికులు లేనట్లు న్నారు అందుకని బస్సు వేయకుండ ఆందరికి కలిపి ఓకే టాటాసుమో ఆరెంజ్ చేసారు. వాళ్ళు కూడ తెలుగువారే . హైదరాబాద్ నుండి . అప్పటికే వాళ్ళు వైష్ణవీదేవి చూచి వస్తున్నారు . మాకు మాంచి కంపెనీ దొరికింది .అనుభవజ్ఞులయిన వారితో మాప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది అని సంతోషపడ్డాము. ఆ దంపతుల పేర్లు అన్నప్ప శాస్త్రి ,శ్రీమతి కళ్యాణి. వీరు క్రితం సంవత్సరం అమర్నాద్ చూచినారు. వారి అనుభవాలు వింటూ మా ప్రయాణం చల్ త్రిల్ గ ఉంటుందని అనుకున్నాము.ఈ ప్రయాణం మన స్వన్త కారులో వెళ్లిన అనుభవం వస్తుంది .. మనకు ఇష్టమొచ్చిన చోటఁడిగి చూస్తో వెళ్ళవచ్చు. షుమారు 5, 6 వందల మైళ్ళు హిమాలయ పర్వతాలపై తిరగడం కొద్దీ గ భయం యనిపించింది . కొండలు లోయలు చిన్నగా కనిపించే కాలువల్లాంటి నదులు తలుచుకొంటే థ్రిల్ . యాత్ర కు అనుకున్నప్పుడు సాయి ని తల్చుకొని మనకు స్వంత కార్లో వెళ్ళితే ఎంత బాగుంటుంది అనుకున్నా . ఆయన అనుగ్రహం వల్లనే సాధ్యపడింది
ఘాట్ రూట్ లో భయం తో గూడిన మా ప్రయాణం దూరమైయేలా రావుగారి శ్రీమతి మాతో వచ్ఛే డ్రైవర్ మంచి అనుభవమున్న ఆప్రాంతానికి చెందిన వాడని అని పరిచయం చేశారు. అతను చాల మంచి డ్రైవర్ . అతని పేరు ఠాకూర్ సింగ్ . 23-6-2006 న 12-30 గంటలకు టాటాసుమో లో మా ప్రయాణం ప్రారంభమయింది .మధ్య సీటులో ముగ్గురు ఆడవాళ్లు ముందు సీటులో శాస్త్రిగారు నేను మాల్యాద్రి వెనుక సీటు లో కూర్చుని బయలు దేరాము .సుబ్బారావు గారి బావమరిది కొబ్బరి కాయ కొట్టి టాటాసుమోకు గ్రీన్ సిగ్నలు ఇచ్చారు .. కారు బయలుదేరి దగ్గరలో పెట్రోల్ బంకు దగ్గర డీజిల్ కొట్టించుకొని ఇండియా గేట్ ప్రక్కగా హరిద్వార్ వైపు పయనమైంది.మా కోరిక నెరవేరుతున్నందుకు ఆ సాయి కి మనస్సు లో ప్రణామం చేసుకొని హిమాలయాపర్వత ప్రాంతము పర్యటనకు శ్రీకారం చుట్టాము . హిమాలయ పర్వతములు హరిద్వార్ దాటాక రుషికేష్దరి లో దర్శనమి స్థాయి . గణేశునికి విఘ్నం లిగించక మా ప్రయాణం సవ్యం గ సాగాలని ప్రార్ధన చేసుకున్నాం . ఇష్టదేవత స్మరించుకొంటూ సాగింది మా యాత్ర సత్య సాయి భగవాన్ తో బదరియాత్ర చేసిన విజయగారి పుస్తకం లోని అంశములు మనస్సులో గుర్తుచేసుకొంటూ సాయి భగవానుని స్మరించుతూ సాగాము . మాకు జంటగా వెంటనే యుండి కాపాడుతూ యుండుమని ప్రార్ధన చేసుకున్నాము . ఒకవైపు నూత్న ప్రదేశముల సందర్సనము ఘాట్రోడ్డు లో ప్రయాణము థ్రిల్ మా ప్రయాణములో చోటుచేసుకున్నాయి . షుమారు 4-30 గంటలకు . హరిద్వార్ చేరాం . కానీ మావాహనం అక్కడ ఆపకుండా నేరుగా ఋషికేశ్ వెళ్లి తిరిగివచ్ఛే సమయం లో హరిద్వార్ చూద్దామని అనుకున్నాం. హరిద్వార్ కి నమస్కారం చేసుకొని ప్రయాణం సాగించాం . 30 కి.మి దూరం లో రుషికేశ్ దూరం . తెల్లవారేసరికి రుషికేశ్ లోని రామానుజకూటం దగ్గర దించాడు. స్నానాలు చేసుకొని దేవాలయ దర్సనం చేసుకోవాలని సిద్దమయ్యాము. ఈలోగా మాడ డ్రైవర్ మా పేర్లు వ్రాయించుకొని రెజిస్ట్రెషన్ కొరకు వెళ్ళాడు. బదరి యాత్ర కు ముందు గ ఇది అవసరం. మేము ఈ లోగా సామానులు ;దింపుకొని రామానుజకూటం లో స్నానం చేసి దగ్గరలో ప్రవహించే గంగా నుండి చూడడానికి తయారయ్యాము. నదిప్రవాహం చాల వేగంగా ఉంటుందిక్కడ . కొండలమధ్య మలుపులు తిరుగుతూ ప్రవాహం ఉధృతికి కారణము . చుట్టూ అందమైన ప్రకృతీ అందాలు విరబోసుకుంటూ హుందాగా గంగ ప్రవాహం తప్పక చూడాలి. కొంచము గంగ ను తల పై ప్రోక్షించుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈశ్వరాలయం దర్సనం చేసుకొన్నాము . మేము రామానుజ కూటం చేరేసరికి డ్రైవర్ సిద్ధంగాఉన్నాడు . మసామానులు కారుపై కట్టి రుద్ర ప్రయాగ్ వైపు ప్రయాణం సాగించాము. ఇది జంక్షన్ . ఇక్కడనుండి ఒక వైపు బదరి మరొక వైపు కేదార్ మార్గములున్నాయి రుషికేశ్ దగ్గర లక్ష్మణ్జ జూలా తిరుగుప్రయాణంలో చూద్దామని నేరుగా కేదార్ కు పయనమయ్యా ము .
23-6-2006 న ఋషికేశ్ నుండి బయలుదేరి మా సుమో "బ్యాన్ ' మీదుగా ప్రయాణముచేసి దేవప్రయాగ్ చేరింది. ఇక్కడనే గంగానది ,భగీరధీ నదులు కలసి ప్రవహించుతాయి. ఋషికేష్ నుండి మొదలు .కొండలు ఎక్కడం దిగడం మరల మలుపులు తిరగడం జరుగుతుంది. కొండ అంచునే ప్రయాణము . మేముసుమో లో వెళ్లుతున్నాంగనూక కొండ అంచుకు కొంత దుర్ముఉంటుంది . అదే బస్సు అయితే అంచునే ప్రయాణము. క్రిందకు చుస్తే పెద్ద అగాధము దట్టమైన అడవులు చిన్నకాలువల్లా ప్రవహించు నదులు కనపడుతుంటాయి. అడవులు దట్టంగా పెరిగి సినిమాసెట్టింగ్స్ లా అగుపించుతాయి. దేవప్రయాగ నుండి ప్రయాణముచేసి కీర్తినగర్ మీదుగా శ్రీనగర్ చేరింది. ఈ శ్రీనగర్ ను ఘర్వాల్ శ్రీనగర్ అంటారు. కాశ్మిర్ లోనే శ్రీనగర్ కాదు . ఇక్కడ చేరేటప్పటికి కొండా ఘాట్ నుండి క్రిందికి దిగినట్లు అనిపించింది. కొండలమధ్య ఉన్న ఈ ప్రదేశం విశాలముగా ఉన్నది.పెద్దషాపులు హోటల్స్ ఉన్నటౌన్ గ ఉన్నది. వాతావరణము మాములు గ ఉన్నది . అక్కడ కూడ ఆగకుండా ప్రయాణము చేసి రుద్రప్రయాగ్ చేరాము. భోజనం అక్కడిచేసాము. కేడర్, బద్రికి వేరుమార్గాలు ఇక్కడ నుండి చీలుతాయి .కేడర్ నుండి విచ్ఛే మందాకినీ , బదరి నుండి ప్రవహించే అల్కనంద ఇక్కడ కలుస్తాయి. ఈ యూరు కొండ పైన ఉండటంవల్ల పైనుండి రెండు నదులను చుస్తే మనోహరంగా ఉంటాయి. శివ కేశవుల సంగమస్థానం ఇది. రెండు కొండలమధ్య వంతెన ఉన్నది . పైనున్న ఘాట్ రోడ్ తిరుపతి రోడ్ కు ఉన్నట్లు సైడ్ వాల్స్ ఉండవు . మా కారు కేదార్నాద్ వైపు బయలుదేరింది . కొండా అంచు నుండి చుస్తే సన్న కాలువల వాలే మందాకినీ నది మనతోటె వస్తున్నట్లు కనపడుతుంది . 3-15 నిమిషములకు గుప్తకాశీ చేరాము. అక్కడ కొంత కొండభాగమును చదునుచేసి వ్యవసాయం చేస్తున్నారు దీన్నే పోదు వ్యవసాయమ్ అంటారు .ఈవిషయం మకారు డ్రైవర్ చెప్పాడు. అతను ఆప్రాంతం వాడే ట ఈప్రాంతంలో వాతావరణం చక్కటిదట మంచి ఆరోగ్యకరం అని చెప్పాడు .అన్ని వసతులు ఉన్నాయి . వారి జీవనమానందం గ ఉంటుందట. రాత్రికి కాస్ట్ విశ్రాంతి టిఇసుకొందామని చెప్పి ఆ డ్రైవర్ అక్కడికి దగ్గరలో నాలా అనే గ్రామం ఉన్నదని కేడర్ కొండా పై పూజారి పాండా అక్కడేఉన్నదని మంకు వసతి చూపించుతాడని చెప్పి మమ్ములను తీసుకెళ్లాడు . భోజనం కుడా అక్కడే దొరుకుతుందని చెప్పాడు .వాడే మాకు గైడ్ కదా .ప్రయాణం సాగించి నాలా గ్రామం చెరము. 30 నిమిషములు పట్టింది. పాండా ఇంటిమీద మెడపై గదిలో రాత్రి బస మంచమ్మీడియే పాడుకొంటే కప్పు తగులుతుంది . ఎదో గుడిసెలో దూరినట్లు గాడి లోకి ప్రవేశించాము. కొండా ప్రాంతంకాదా దానికి తగ్గట్లే నిర్మాణము జరిగింది మాకొరకు అన్నం చపాతీ చేయించాడు .ఇంటి వెలుపలకు వఛ్చి చూస్తే మేము కొండ అంచున ఉన్నాము. ఎదురుగ మంచుతో నిండిన కొండలు మేఘాలు పూర్తి గ కమ్ముకొని ఉన్నాయి . షుమారు 8 గంటలే అయినా వెల్తురు బాగా ఉన్నది .పాండా గారి భోజనం తిని ఆ గదిలో నిదురించాము .మా తో వచ్చిన శాస్త్రి గారు వారిభార్య హాలు లో నే విశ్రమించారు ..
24-6-2001 ఉదయం మెలకువ వచ్చ్చేటప్పటికీ 4-30 గంట లయింది . తలుపు తెరిచి చూచేసరికి వెల్తురు వచ్చ్చేసింది .మా ప్రయాణం 6-30 కి అని మరల పడుకున్నాం . ఒక గంట తర్వాత లేచి కాలకృత్యములు తిర్చుకొని వేడి టి త్రాగి మా డ్రైవర్ కొరకు ఎదురుచూస్తున్నాము. నాలా నుండి టాటాసుమో బయలుదేరింది. రాంపూర్ ,సొన్ ప్రయాగ్ దాటుకుంటూ గౌరీకుండ్ చేరాము . ఇది సముద్ర మట్టానికి 9500 అడుగులపైన ఉన్నది .అక్కడి నుండి కేదార్నాద్ కు కార్ పోదు . కేవలం గుర్రాలు డోలీలు నడక ద్వారా వెళ్ళాలి .గౌరీకుండ్ చేరగానే ఆలోచించి కేదార్ కొండ14 కిమీ లు నడవలేము. గుర్రాల పై వెళ్ళేదైర్యం లేదు . పైగా చాల చలి ఎక్కువగా ఉన్నది . దానికి తోడు చినుకులు పడుతున్నాయి . వాతావరణము అనుకూలము లేదు. గౌరీకుండ్ పార్వతీదేవి శివుని కొరకు తపస్సు చేసిన ప్రాంతం . ప్రక్కన్నే ఒక ఉష్ణకుండం ఉన్నది . దాని లో నీరు ఎప్పుడు వేడిగా ఉంటుంది . అక్కడ అంత చలిలో అక్కడ స్నానం చేసుకోడానికే భగవంతుడు దాన్ని సృష్టించాడనిపించుతుంది. నిరు నంది నోటినుండి వస్తుంటాయి . నంది మూతిక్రింద చేయి ఉంచితే చిర్రు మంటుంది కానీ దిగిస్నానం చేస్తుంటే అంట వీడి అని పించదు .ఆవిరి వస్తుంది .స్నానం ఆహ్లదకరం గ ఉంటుంది , స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటుంది./ నేను రెండు పర్యాయములు చేశాను. బయటికి రాగానే చలి . కేడర్ వెళ్ళేదైర్యం చాలక వెనుతిరిగి రాంపూర్ వెళ్లి విశ్రాంతి టిఇసుకొని బదరి వెళ్తామని అనుకొన్నాము. శాస్త్రిగారు మాత్రం గుర్రం పై వెళ్లడానికి నిశ్చయిందుకున్నారు. .ఆయన భార్య మాత్రం మాతో ఉంది పోవడానికి అనుకున్నది. మమ్మల్ని రాంపూర్ లో దింపి మరల గౌరీకుండ్ చేరి శాస్త్రి గారి కొరకు డ్రైవర్ వెళ్ళాడు . శాస్త్రి గారు గుర్రం పై వెళ్లారు . ఆయన భార్య మాతో ఉంది . పాపం ఆమెకళ్ళలో నిరు తిరుగుతున్నది . ఆమె కు దైర్యం చెప్పి రాంపూర్ చేరాము. డ్రైవర్ చెప్పినట్లు గానే అక్కడ రూమ్ తీసుకుని భోజనానికి ఆర్డర్ ఇచ్చాము . రూంలో రెస్ట్ తీసుకున్నాము. సాయంకాలానికి శాస్త్రి గారు వచ్చి మాతో కలిశారు.ఆయన అనుభవాలు రోడ్ తీరు గురించి చెప్తుంటే మేము పోలేక పోయామే అని భాద పడినాము .అయితే అక్కడకు వెళ్లివచ్చిన శాస్త్రిగారి అవస్థ చూచి కష్టసాధ్యమేననిపించింది . ఆయన చేతులు స్వాధీనం లోకి రావడానికి చాల శ్రమ పడ్డారు. అమృతాంజనం రుద్ది కాపడం పెట్టుకున్నారు. ఇక్కడ రాంపూర్ లో 100 రూపాయలకు రూమ్ దొరికింది . ప్రక్కనే భోజనం కి ఆర్డర్ ఇఛ్చాము .. సాయంకాలం భోజనం ఇయింది అనిపించాము .రాత్రికి మకాం అక్కడే . కొండా అంచుదగ్గరికె వెళ్లినేను మాల్యాద్రి తిరిగి చూచాము .

25.-6-2001 రాంపూర్ రూమ్ నుండి ఉదయం 6. లకు మా వాహనం లో బయలుదేరాం .6-30 ని. రుద్రప్రయాగ్ డిస గ ప్రయాణం అయాము 7-10 కల్లా నాలా ,గుప్త కాసి ,బీహారీ ,చంద్రపురి,అగస్త్య ముని ,దిల్వారా,మీదుగా ప్రయాణం చేస్తూ 8-30 కు రుద్రప్రయాగ్ చేరాము. అక్కడ నుండే బదరి వైపు తిరుగుతుంది కార్న్ ప్రయాగ ,నంద ప్రయాగ , మీదుగా ప్రయాణము చేసి ఛమోలీ కి 11-00 గ. లకు చేరాము. అక్కడ మా వాహనం స్టెప్ని వీల్ కు గాలి పట్టించి 11-30 గ లకు పిప్ఫల్కోట్ చేరాము . అక్కడ భోజనం చేసుకొని 12-30 కి తిరిగి ప్రయాణం సాగించి గరుడ గంగ , తంగిని ,హేళన మీదుగా మరో ప్రధాన ప్రాంతమయిన జోషిమట్ 1-30 ని లకు చేరాము, జోషిమత్ నుండి ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేస్తారు. ఇక్కడనుండి రూట్ విశాలంగా ఉండదు . కొంచం ఇరుకుగా ఉంటుంది. ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అనుమతించుతారు .తర్వాత ఎదురుగ వచ్ఛే వారికీ అనుమతించుతారు . జోషిమట్ గేట్లు తెరిచాక పాండుకేశ్వర్ వరకు అనుమతించి తర్వాత అక్కడ ఆపి క్రిందికేళ్ళే కార్లకు అనుమతించి తర్వాత మకారుకు అనుమతి లభించింది . మేము గోవిందఘాట్ మీదుగా పాండుకేశ్వర్ రావడానికి 3 గ పట్టింది అక్కడనుండి విష్ణుప్రయాగ్ మీదుగా బదరిచేరేసరికి సాయంకాలం 4-15 అయింది , మా డ్రైవర్ వాడి అలవాటుప్రకారం మా కారును కర్ణాటక వారి సత్రం దగ్గరకు తీసుకెళ్లాడు . కానీ అక్కడ నుండి దేవాలయం చాల దూరము, అందుకని రామానుజ కూటం కు వెళ్లాలని నిశ్చయించుకున్నాం .డ్రైవెర్తో చెప్పాము . అలాగే తీసుకెళ్లాడు . రామానుజకూటం మేనేజర్ ఉషశ్రీ గారిని కలుసుకుని రూమ్ కొరకు అడిగాము . ఆవిడ నన్ను ఎక్కడో చూచానని అన్నది . బహుశా విజయవాడ లో సీతానగరం లో చూచియుండవచ్చ ని చెప్పాను . మేడమీది 25 వ రూమ్ మాకు ఇచ్చ్చారు . రోజుకు 250 రూపాయలు క్రింద గదులకన్నా ఇక్కడ చలి తక్కువని చే ప్పారు . కార్పెట్ పరిచియున్నందున చలి అంతగా ఉండదట. గదిలోకి సామానులు మర్చి మేము చేరేటప్పటికి 6-30 అయింది . ముందుగా దర్సనమ్ చేసుకొమని మేనేజరు చెప్పారు . తర్వాత తెరిగివచ్చి టిఫిన్ ఇక్కడే చేయవచ్చుఅన్నారు. సాయంకాలం స్నానం అవసరం లేదు అక్కడ . అది పుణ్య భూమి . దూళిదర్శ్నము సర్వ పాప హారమని బదరీనారాయణు ని దర్శనం కొరకు బయలుదేరాము.
కేదార్నాద్ వెళ్లే సమయంలో మన వెంటనే మందాకిని అనుసరించి వస్తుండేది . అదే విధంగా ఇక్కడ అలకనంద నది ప్రవహించుట చూస్తాం . దేవాలయం లోకి అనేది పై న ఉన్న వంతెన పైనుండి నడుస్తాము . వంతెన క్రింద నుండి ప్రవాహము చూస్తూ వెళ్ళటం చాల బాగుంటుంది . ఈవంతెన దాటుతూ కుడివైపు తప్త కుండము కనుపించుతుంది . ఆ కుండం లో నిరు వేడిగా సెగలు కక్కుతూ పొగలు వస్తూఉంటాయి .గౌరీ కుండం లో మాదిరి ఇక్కడకూడ స్నానం చేస్తారు .ఎక్కువ సమయం న్నిటిలో ఉండరాదు అన్నారు .స్త్రీ లకు ప్రత్యేకముగా ఉన్నది , అలకనంద నది ఈ తప్త కుండం ప్రక్కనే ప్రవహిస్తుంది నది లో నిరు ఐస్ ల చాల చల్లగా ఉంటాయి. చేయి పెడితే కొంగర్లు పోతాయి . మరి ప్రక్కనే ఉన్న తప్త కుండం లో నీరు మాత్రమే వేడిగా సెగలు పొగల్తో ఉంటుంది. ఇదే అద్భుతము భగవంతుని చమత్కారంమై న సృష్టి గదా. ఈ ఉష్ణగుండం ప్రక్కనే నడుచుకుంటు వెళ్ళితే దేవాలయంలో ప్రవేశిస్తాము. . అప్పటికే స్వామివారి దర్సనం జరుగుతున్నది. ప్రసాదం బయటనే కొని లోపలి వెళ్ళాము దూరము నుండి దర్సనం అవడం వల్ల ఆంధ్ బాగా కనిపించలేదు. . హారతి టికెట్ 75/_ తీసుకొని లోపలి కి వెళ్ళాము. హారతి పూర్తి అయ్యేవరకు ఆలయములో కూర్చునే సావకాశంగా స్వామి దర్సనమ్ చేసుకున్నాము. బదరీనారాయణునికి లక్ష్మి వృద్దవుడు,ఎడమవైపు కుబేరుడు ,గణేశుడు, కుడివైపు నర నారాయణ విగ్రహములు క్రింద వైపు గరుడుడు నారదుడు విగ్రహములు పరివేష్టించి ఉన్నాయి. ఇవిగ్రహములు పూర్తిగా పూలతో అలంకరించినందున్ ముఖఃము సరిగా కనిపించ లేదు . యాచకుడు హారతి ఇచ్ఛే సమయంలో విగ్రహాలు ఆకర్షణీయముగా కనిపించుతాయి. వాతావలనం చల్లగా ఉండటం వాళ్ళ పూజారులు ఫుల్ కోటు స్వీటర్లతో ఉంటారు.. మేము వెళ్లిన సమయం జూన్ కాబట్టి పరవాలేదు కానీ చలికాలం లోఅయితే కష్టమే . అంతరాలయంలో కూర్చునేటప్పుడు న మంకీ కాప్ జారీ క్రింద పడిపోయింది . నేను చూసుకోకుండా బయటికి వచ్చా . మైకు లో అంనౌన్సుమెంట్ వి ని తెచ్చుకున్నాను . ఆలయం చుట్టి ప్రదక్షిణం చేసాము . ఆదిశంకరాచార్య చే ప్రతిష్ఠచేయబడిన లక్ష్మీనారాయణుల ప్రతిమ లను చూచాము. ప్రక్కనే ఉన్న పరమశివుని ప్రతిమలను దర్సనం చేసుకున్నాము. దేవాలయం కుడిభాగములో గంటకర్ణుని ఆలయం ఉన్నది . ఆ ఆలయానికి దిగువనే చిన్న గుడి ఉన్నది . దేనిలో దేవుని వలె ఒక మనిషి కూర్చుని ఆసిర్వదా ముద్రలో ఉన్నాడు . కానీ అతనెవరో తెలియలేదు. ఎవ్వరిని అడిగిన చెప్పలేదు . ఈకార్యక్రమం పూర్తిచేసుకొని రామానుజకూటము చేరాము. అక్కడ అప్పుడే టిఫిన్ టైం . టిఫిన్ చేసి వాళ్ళు ఇచ్చిన వేడ నీరు పుచ్చుకున్నాము . చలి ప్రదేశము కదా చల్లని నిరు త్రాగరు . అందుకని కొంత వేయినీరు ఫలాస్క్ లో పోసుకొనే రూము చేరాము. మా డ్రైవర్ తిరుగుప్రయాణం ఉదయం 9 గంట్లకని చెప్పాడు . కానీ మేము గుడి తప్ప ఇక్కడ ఏమి చూడలేదని ఇంకొక రోజు ఉండమని తలచము. ఉదయం బ్రహ్మ కపాలం చూచి అక్కడ పిండప్రదానం చేసుకో వాలి . ఆ రోజు రూమ్ వెళ్లి నిదురపోయాము.
26-6-2001 ఉదయం గంటలకు నిద్రలేచి కాల కృత్యాలు ముగించి మేము బస చేసిన గది బయట వరండా లోకివచ్చి చూస్తే ఎదురుగ ఊర్వశి పర్వతములు ,నారాయణ పర్వతములు క్రిందనుండి ప్రవహించే అలకానందనది కనిపించుతాయి . రెండు పర్వతముల మధ్య మంచు తో కప్పబడిన ఐస్ ఒక శిఖరం కనిపించుతుంది అదేనీయులకంట శిఖరమట .. ఆ శిఖరంపై పడే సూర్యకిరణాలు ఆ పర్వతం వెండికొండ లా కనిపించుతుంది . ఈ దృశ్యం వర్ణనకు అసాధ్యం . కొండా మీదికి పొతే ఇంకా చాల మనోహర దృశ్యాలు కనిపించుతాయి . నారాయణ పర్వతం లోనే బదరీనారాయణ దేవాలయం ఉన్నది . ఎదురుగా నర పర్వతం ఉన్నది . ఈ రెండు పర్వతములపై నర నారాయణులు తపస్సు చేసిన ప్రదేశమంటారు. ఇక్కడ నిష్టలతో పనిలేదు.
నారాయణ పర్వతం నీలకంఠ శిఖరపు అంచుల మధ్య నుండి ఒక సెలయేరు ప్రవహించి అల్కనందలో కలుస్తుంది. దానిపేరు ఋషిగంగ . ఇదంతా మేము బస చేసిన రామానుజమకుటం వరండ నుండి చుస్తే చక్కగా కనుపించుతుంది.
బ్రహ్మకపాలం లో పితృదేవతలకు పిండప్రదానం అక్కడ జరిపించితే వైకుంఠం ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అక్కడి పురోహితులు మాత్రం అర్హులు . ఆ కార్యక్రమము కొరకు రుసుము రూ 250/- . దేసిక్ పండిట్ అనే పురోహితుని కి డబ్బు చెల్లించి సిద్దమయ్యాం . బదరీనారాయణునికి నివేదించిన ప్రసాదం టూ పిండప్రదానం జడుపుతారు . కార్యక్రమం మాత్రం ఆంద్ర పువుహితుల చేత చేయించుతారు. దీనికి బ్రాహ్మణుల మధ్య గొడవలు జరుగుతాయట అందుకని క్షేత్ర పురోహితుని అంగీకారం అవసరం . ముందుగా అనుకున్న ప్రకారం ఆ రోజు ఉదయం 9 గంటలకు ఏలూరుకు చెందిన పురోహితుని మాకు పంపారు . మేము ముందుగా తప్త కుండం లో స్నానం చేసి తడిబట్టల్తో బ్రహ్మ కపాలం చేరాము . అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈప్రాంతము అల్కనంద స్నానఘట్టం ప్రక్కనే ఉన్నది . అక్కడనే ఒక ప్రక్కన కాపాలము ఆకారంలో ఒక పెద్ద బండ రాయి ఉన్నది. అదే బ్రహ్మకపాలము . పిండప్రదానం కార్యక్రమం మొదలయింది . కొంత ఎండ పొడ కనిపించింది .సంతోషించాము . కార్యక్రమము చక్కగా జరుపుకోవచ్చుననుకున్నాము. ముందుగా మాలో పెద్ద వాడయిన శాస్త్రి గారు మొదలుపెట్టారు . 32 పిండములు స్వామి ప్రసాదం తో చేయించి మొదట తర్పణం చేయించి తర్వాత దర్భలు పరిచి తల్లి తండ్రి మొదలు అందరి పేర్లు చెప్పించి చివరలో అత్తమామలు పేర్లు చెప్పి పిండప్రదానం జరిపించించారు. ఇంతలో ఉన్నట్లుండి దట్టమైన మేఘ్ ములతో వవర్షము ప్రారంభమైంది . తర్వాత నేను మొదలెట్టాను . చివర్లో మాల్యాద్రి చేసాడు. విపరిమిత మైన చలి జోరుగా వర్షం .చేతులు కొంగరాలు పోతున్నాయి..మొద్దుబారినట్లు చేతులు స్వాధీనం కావడం లేదు. మధ్యలో స్తలం మార్చగూడదట .అందుకని అక్కడనే జరిపించాము. మా తల్లి దండ్రులు అత్తమామ లు మేనమామలు చనిపోయిన అందరికి పేరు పేరు న పిండప్రదానం చేసాము ఈపిండములకు నమస్కారము చేసుకొని బ్రహ్మకపాలం పై న పెట్టి మంత్రయుక్తముగా అలకనంద నది లో కలిపాము. తిరిగి స్నానము చేయరాదని చెప్తే కళ్ళు చేతులు కడుగుకొని బయలుదేరాము. ఐ విధముగ మా పెరూదేవతల ఋణము తీర్చుకున్నాం. అమ్మను తల్చుకొంటే కళ్లనీళ్లు ప్రవహించాయి. . మా అమ్మ అంటుండేది నాకు బదరి చూపించారా అని అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. కనిసం పిండ ప్రదానం బదరి లో పెట్టిన తృప్తి మిగిలింది ., ఆమె కోర్కె ఐన శ్రీ రంగం చూపాను గదా అని తృప్తి కలిగింది మరి అమ్మ కోరిక ఈ విధం గ తీర్చ గలిగానని అమ్మ ఆత్మా కు శాంతి కలిగియించా నాని తృప్తి కలిగింది. ఈ కార్య క్రమం నెరవేర్చుకొని రామానుజ కూటం చేరి భోజనం చేసాము. తర్వాత విశ్రమించాము.
సాయంత్రం 4 గంటలకు మా డ్రైవర్ వచ్చ్చాడు . సరస్వతి నడిపుష్కరములు అప్పుడు జరుగుతున్నాయట అది చూడ దానికి బయలుదేరాము . శాస్త్రి గారి భార్య రాలేనని చెప్పింది మేము అయిదుగురం బయలుదేరాము. "మానా " వరకు టాటాసుమోలో వెళ్ళాము .. మానా గ్రామం 2 కి మి లో ఉన్నది . రోడ్ అంతవరకు మాత్రం ఉన్నది . అక్కడి నుండి కొండా ప్రాంతమే . అరా మై లు దూరములో నరస్వతి నది వచ్చింది . నది జన్మస్తలము అది . దూరం ఎక్కువ లేదని నడక సాగించాము .వాన ప్రారంబ మైంది దగ్గర్లో ఉన్న షాప్ లో రైన్ కోట్ ప్లాస్టిక్ ది కొన్నాము. అది ధరించి వాన లోనే బయలుదేరాముపర్వతప్రాంతం . ఎక్కడానికి మాఆవిడ ఆయాస పడింది ,కొంతదూరము వెళ్లి కూర్చుండిపోయింది . మేము అక్కడ క్కడ కూర్చుంటూ నడక సాగించాము . ముణ్దు మల్యాద్రి కళ్యాణి ల వెనుక మేము నడిచాము .. ఆ దరి తిన్నగా వ్యాస గుహ దగ్గరకు వచ్చాము . ప్రక్కనే గణేష్ గుహ ఉన్నది . వేదవ్యాసుడు గణేశునికి భారతమ్ చెప్తూ వ్రాయించి ప్రదేశము అదీ . కొంత శ్రమ పడినా ప్రాముఖ్యమైన ప్రదేశం చూస్తుంటే కంటి నుండి ఆనంద భాష్పాలు వచ్చ్చాయి .అక్కడ నుండి మరికొంత దూరం వెళ్ళితే వేదవ్యాసుని చే విభజించబడిన వేద స్వరూపములు శిలా రూపములో సాక్షాత్కరిస్తాయని అన్నారు. కానీ మేము అంత దూరము వెళ్లలేక పోయాము . వెనుకకు తిరిగి సరస్వతి నది పరివాహక ప్రదేశం చూస్తూ క్రిందికి దిగి నడక సాగించాము. కొండాల నడుమ సరస్వతి నుండి సెలయేరులా దర్శనం ఇచ్చింది . అక్కడ తప్ప సరస్వతి మరెక్కడ మనకు కనపడదు . సరస్వతి నది అంతర్వాహినికదా . అక్కడ నిరు చాల శుభ్రముగా ఉన్నాయి. తెచ్చుకున్న బాటిల్ లో నిరు తీసుకున్నాము. మంచు కరిగ్గిన నిరు అవడంవల్ల చాల చల్లగా ఉన్నాయి. ఎవ్వరు స్నానం చేయడానికి సాహసం చేయరు . ఈ సరస్వతి అలకనంద, వసుధారలో కలిసే సంగమం లో పుష్కర పిండప్రదానం చేస్తున్నారు. అది అతి దగ్గర్లో ఉన్నది .
రెండు కొండలమధ్య బ్రిడ్జి లేదు గై ఒక పెద్ద బాండ ఉన్నది. దాని మీదినుండి యాత్రికులు నడచి వెళుతారు. దానినే బీమునిబండ అంటారు.. వర్షంవల్ల చాల జారుడుగాఉన్నది . మేము పైకి వెళ్లలేక పోయాము . వెనుతిరిగాము. పాండవులు మహాప్రస్థానం సమయం లో భీముని చే వేయబడిన ఆబండ పైనుండి కైలాసం శిఖరం వైపు వెళ్లారు . పురాణప్రసిద్దికి చెందిన ఈ ప్రాంతము " మానా" గ్రామపు సరిహద్దలలో ఉన్నది . అది దాటితే "టిబెట్" మొదలవుతుంది . ఉమన దేశపు ఉత్తర సరిహద్దు వరకు వెళ్లి న అనుభూతి పొందాము . తిరిగి మేము రామానుజకూటము చేరాము . టిఫిన్ రెడీ గ ఉన్నది. ఆ రోజు మేము పిండప్రదానము చేయడం చేత నేను మాల్యాద్రి ఉపవాస ము .
27-6-2001 . రామానుజకూటంలో ఉదయం 6-00 గం లకు లేచి 6-30 కి తిరుగు ప్రయాణం చేయడానికి సిద్దమయ్యాము . ప్రకృతి నిర్మలంగా ఉన్నది .ఎండ గుడా వచ్చింది .రూములో సామానులు సదుకొని ఖాళీచేసి మావాహనములో బయలుదేరాము .తిరిగి ఘాట్రోడ్డు ప్రయాణం మొదలయింది .పాండుకేశ్వర్ చేరాము. అక్కడ ట్రాఫిక్ రేగులెట్ చేస్తున్నారు .మకారు ఆపారు .అర్ధగంట తర్వాత వదిలారు . రురప్రయాగ్ చేరీటప్పటికీ 12-45 అయింది ..మా డ్రైవర్ నేరుగా ప్రయాణం సాగించి రాత్రి హల్ట్ శ్రీనగర్ అని చెప్పాడు. ఘర్వాల్ శ్రీనగర్ అంటారు ఆప్రాంతాన్ని. మధ్యాహ్నం . 2-00 గంటలకు శ్రీనగర్ చేర్చాడు .ఇక్కడ భోజనశాల దూరం అందుచేత మమ్ములను కారు లో హోటల్ కు తిసుకెళ్ళి తర్వాత దేవలోకే లోడ్జ్ లో వదిలాడు. ఇది సమతల ప్రదేశం కనుక చలి లేదు వేడి ఎక్కువని పించింది .రూమ్ లో ఆరుగురం కాలక్షేపము చేసాము. సాయంకాలానికి భోజనం భోజనం ఆర్డర్ చేసినే లో నే నిద్రించాము .
28-6-2001 శ్రీనగర్ లో ఉదయం లేచి కాలకృత్యములు టిఇర్చుకొన్నాము . 9-30 గంటలకు మా డ్రైవర్ రాగానే ప్రయాణ సన్నాహములో నిమగ్నమయ్యాము. ఆ డ్రైవర్ ఆ ప్రాంతం వాడే ఇంటికి వెళ్ళాడు. హుషారుగాఉన్నాడు . ఇక తిరుగు ప్రయాణం మొదలయింది .రుషికేశ్ , హరిద్వార్ వైపు మాప్రయాణం సాగింది. సమతలం నుండి మరల ఘాట్ రోడ్ ఎక్కింది మా కారు.. కొండా పైకి ఎక్కింది . అంచుల ప్రక్కన ప్రయాణం సాగుతున్నది . 12-30 గంటలకు రుషికేశ్ చేరాం.. మేము ఆప్రాంతమంతా చూడలేదు .వెళ్లే టప్పుడు . ముందుగా లక్ష్మణ్ ఝులా. చూచాము . లక్ష్మణ్ ఝుల పైన ఉన్న వంతెన ఉగుతు ఉయ్యాల లాగా చక్కగా ఉన్నది. దాని పైన నడుస్తుంటే తల తిప్పుతున్నట్లు గ ఉంటుంది అక్కడ దేవాలయం దేవతా దర్శనం అనంతరం ఉలెన్ క్లాత్ మార్కెట్ చూచాము .. వంతెన పైనుండి సత్యసాయి సడన్ స్కూల్ చూచూచాము . ఆయన కరుణాకటాక్షము మాపైనే ఉన్నఅందుకు మనసు కు చాలా ఆనందం కలిగింది . తిరుగు ప్రయాణ ము కూడ చక్కగా జరిపించమని ఆయను ప్రార్థన చేసుకొన్న. లంచ్ రుషికేశ్ లోనే చేసాము . తిరిగి ప్రయాణం ఆరంబించి మధ్యాహ్నము 3-00 గంటలకు హరిద్వార్ చేరాము. మాడ్రివేర్ తిరిగి ఢిల్లీ వెళ్లదామని చెప్పాడు. సాయంకాల పు గంగ హారతి చాల ప్రసిద్ద మని అది చూచి వెళ్లుదమని చెప్పాము . కార్ భట్టారాయ్ డౌన్ ఐడియాని నెట్టవల్సి వస్తుందని డ్రైవర్ చెప్పాడు. ఢిల్లీ కి ఆ రాత్రి ప్రయాణం మంచిదికాదని డిల్లీలో ట్రావెల్ ఏజెన్సీ తో మాట్లాడి ప్రయాణం అఫినిట్ హల్ట్ అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. ముల్తాన్ సేవాశ్రమం లో ఒక రూమ్ టిఇసుకొని మా సమన్లు తరలించి గంగానది దగ్గర చేరాము . సాయంకాలహరతి . హారతి చాల బాగావుంది .. మయాత్ర అంత ఒక ఎత్తు అయితే హారతి ఒక ఎత్తు. . చాల కోలాహలం గ ఉన్నది .. మా శ్రమకు ఫలితం దక్కిందని పించింది.
29-6-2001 ఉదయం 6-30 గంటలకు హరిద్వార్ నుండి బయలుదేరి ఢిల్లీ దారి పట్టము . ఇక్కడ రోడ్ చాల బాగుంటుంది . కనుక ఎలాటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం 1-30 న్యూఢిల్లీ చేరాము. మంచి లాడ్జి దగ్గర దింప మని డివెర్ కు చెప్పం . కర్ణాటక వారి మధ్వ మందిరం దగ్గరకు తిసుకేళ్లాడు . కానీ మాకు అక్కడ ఖాళీ లేదని తెలిసింది . మాతో వఛ్చిన శాస్త్రిగారు తాను క్రితంలో బసచేసిన లాడ్జి కి పొమ్మని డ్రైవర్ తో చెప్పాడు . అది సిటీ లో మంచి లాడ్జి . రూమ్ రెంట్ 400/- రూపాయలు . దానికి దగ్గరలో నే ఒక హోటల్ ఉన్నది చక్కని దక్షిణాది భోజనం చేసాము. అక్కడే విశ్రాంతి. రాత్రికి లైట్ గ టిఫిన్ చేసాము. నేను తిరుగు ప్రయాణం కొరకు 30 కి జి టి ఎక్ష్ప్రెస్స్ లో రిజర్వు చేశాను . అది సాయంకాలం 6-30 కి .అప్పటి వరకు ఢిల్లీ లో నే గడపాలి . ఈ సమయంలో నే ఢిల్లీ పరిసరాలు చూద్దామని అనుకోన్నాం.
30-6-2001 ఉదయం నే లేచి కాలకృత్యములు పూర్తీ చేసుకొని దగ్గర లోనే యున్న మరో ట్రావెల్ఏజెన్సీ కి వెళ్లి ఓకే అంబాసడర్ కార్ బుక్ చేసి దానిలోసామానులు సర్దుకో ని దానిలో ప్రయాణం చేసి సాయంత్రం కి ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరేలాగా డ్రైవెర్కి చెప్పి బయలుదేరాము. డ్రైవెర్తో మా ఒప్పందం ప్రకారం ముఖ్యప్రదేశములు చూడడం మొదలెట్టాము. భోజనం టైంకు కన్నాట్ ప్లేస్ కి వఛ్చి ఒక మద్రాస్ హోటల్ లో భోజనం చేసి పాలిక బజారు చూడడానికి వెళ్ళాం.. అండర్ గ్రౌం డ్ బజార్ లో తిరిగి కో న్నీ వస్తువులను కొన్నాం . తర్వాత బయల్దేరి రెటీఫోర్ట్ వైపు గ ప్రయాణం చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరాము. అప్పటికి 4-30 అయింది ట్రైన్ 6-30 కి స్టేషన్ లో నే వెయిట్ చేసి .ట్రైన్ రాగానే మా సీట్ లు చూసుకొని కూర్చున్నాం . న్యూఢిల్లీ కి బై చెప్పం
మా బదరి యాత్ర అనుభవాలు నెమరు వేసుకుంటూ ప్రయాణము సాగించాము. హిమాలయ దర్శనం బ్రహ్మ కపాల లో అపితృదేవులకు మేము చేసిన పిండ ప్రదానం మా జీవితంలో ఒక మరపు రాణి అనుభూతి . మహాఋషులు సంచరించిన ప్రాంతం లో మేము కూడ తిరిగామన్న అనుభూతి పొందాం. డీని కి స్వామి కరుణాకటాక్షం పరిపూర్నాగా ఉందని ఆయనకు మనసారా నమస్సులు సమర్పించుకొన్నాం
మా బదరి యాత్ర లో పాల్గొన్న సభ్యులు , దర్శించిన పుణ్యస్థలముల
Bagundi Thathya !!!
ReplyDeleteexcellent, very nice narration..
ReplyDelete