దయచూపవయా కరుణానిలయా
గోదావరితట శిరిడీ వాస
మదిలో నిండిన మాయను బాపి
పదిలముగా నా హృదినే నిలచి దయ
నిలువగగలనా నీ దయ లేకనే
మెదలగా తరమా నీ కృపాచాలక
అంతరాత్మవే నీవని తెలియక
అంధకారమున వేదుకామొదలిడితి దయ
పొంతనలేని కోర్కెలతో
అంతులేని ఈ సంసార జలధిలో
గమ్యము కానక పయనించు నౌకను
సవ్యముగా దరిచేర్చి కావుమయ దయ
సర్వము నీవని నమ్మితినయ్య
మర్మము తెలియని మనుజూడ నయ్య
నీ దివ్య చరణమే నకిక శరణం
రమ్యమైనదే నీ నామస్మరణం దయ
Nice🙏
ReplyDelete